మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు.. మరో ఐదుగురు మృతి
మణిపూర్‌లో ఓ క్యాస్ట్ రిజర్వేషన్ తెచ్చిన వివాదం గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో అల్లర్లకు కారణం అయింది.
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో ఓ క్యాస్ట్ రిజర్వేషన్ తెచ్చిన వివాదం గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో అల్లర్లకు కారణం అయింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఆ రాష్ట్ర సీఎం నాలుగు రోజుల్లో 40 మంది సాయుధ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని సీఎం ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు. దీంతో మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ హింసలో ఒక పోలీసు సహా మొత్తం ఐదుగురు మరణించారు. అలాగే మరో 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ అల్లర్లు నేపథ్యంతో ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు.