కీలక వ్యాఖ్యలు చేసిన బెంగాల్ గవర్నర్

రాష్ట్రంలో ఘర్షణల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బస్ కీలక వ్యాఖ్యలు... "Rioters Won't Go Scot-Free": Mamata Banerjee On Ram Navami Violence

Update: 2023-04-04 12:12 GMT

కోల్‌కతా: రాష్ట్రంలో ఘర్షణల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోకిరీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించబోమని మంగళవారం అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మతోన్మాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తాయని అన్నారు. జిల్లాల్లో సీనియర్ పోలీసులు అధికారులు పరిస్థితులపై స్థానికులకు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పించాలని సూచించారు. రామనవమి నుంచి బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వేచ్ఛగా వదిలిపెట్టమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రామనవమికి అల్లర్లు సృష్టించింది బీజేపీ పనేనని విమర్శించారు. వారు రాజకీయ గుండాలని, ప్రతిఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మైనార్టీలకు రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News