Rickshaw Driver : విద్యార్థినిపై రిక్షా డ్రైవర్ లైంగిక వేధింపులు

దిశ, నేషనల్ బ్యూరో : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ రిక్షా డ్రైవర్ 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Update: 2024-09-01 12:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ రిక్షా డ్రైవర్ 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నగరంలోని బోరివాలీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా సదరు రిక్షా డ్రైవర్ అడ్డుకొని లైంగికంగా వేధించాడు. బాలిక బిగ్గరగా అరవడంతో పరిసర ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

వారిని చూసి రిక్షా డ్రైవరు పరారయ్యాడు. దీనిపై పోలీసులకు బాధిత బాలిక ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిక్షా డ్రైవరును పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌‌ను ఏర్పాటు చేశారు.


Similar News