CBI : సుప్రీంకోర్టును ఆశ్రయించిన కోల్‌కతా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్

దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-09-04 13:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాలేజీలో ఆర్థిక అవకతవకల అభియోగాలకు సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించనుంది.

ఆర్థిక అవకతవకల కేసులో సోమవారం రాత్రి సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సందీప్ ఘోష్‌ను సీబీఐ ఇంటరాగేట్ చేస్తోంది. ఈ తరుణంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.


Similar News