చరిత్ర తిరగ రాయండి.. కేంద్రం మద్దతు ఉంటుంది: అమిత్ షా

భారతీయ సంబంధ చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు.

Update: 2022-11-24 17:19 GMT

న్యూఢిల్లీ: భారతీయ సంబంధ చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీనిచ్చారు. ఒకప్పటి(16వ శతాబ్దం) అహోం రాజ్యం(ప్రస్తుత అసోం) కమాండర్ లచిత్ బర్ఫుకన్ 400వ జయంతి ఉత్సవాలను అసోం ప్రభుత్వం ఢిల్లీలోనూ నిర్వహిస్తున్నది. ఇందులో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 'నేను హిస్టరీ స్టూడెంట్‌ని. మన చరిత్రను సరిగ్గా అందించలేదని, అది వక్రీకరించబడిందని తరచూ వింటున్నాను. అది సరైనదే కావచ్చు. ఇప్పుడు మనం దీన్ని సరిదిద్దాలి. చరిత్రను సక్రమంగా, అద్భుతమైన రీతిలో ప్రదర్శించకుండా మనల్ని ఎవరు ఆపుతున్నారు అని మిమ్మల్ని అడుగుతున్నాను.

దేశంలో ఎక్కడైనా 150 ఏళ్లు పాలించిన 30 రాజవంశాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన 300 మంది ప్రముఖులపై పరిశోధన చేయడానికి ఇక్కడున్న విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రయత్నించాలని అభ్యర్థిస్తున్నాను. ముందుకు రండి, పరిశోధించండి. చరిత్రను తిరగ రాయండి. కేంద్రం మద్దతు ఇస్తుంది' అని అమిత్ షా అన్నారు. అలాగే, మొఘల్ విస్తరణను అడ్డుకోవడంలో లచిత్ పోషించిన పాత్రను ప్రస్తావిస్తూ, సరిఘాట్ యుద్ధంలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారిని ఓడించినట్లు చెప్పారు.

ALSO READ

మల్లారెడ్డికి మంత్రి పదవిలో ఉండే అర్హతే లేదు.. బీజేపీ నేత శాంతి కుమార్

Tags:    

Similar News