Reservation: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్.. మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం
మహిళా రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో 35శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో: మహిళా రిజర్వేషన్లపై(Women Reservation) మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు పేర్కొంది. సీఎం మోహన్ యాదవ్(Cm mohan Yadav) అధ్వర్యంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు కేబినెట్ (Cabinate) ఆమోదం తెలిపింది. సివిల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్‌తో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని వెల్లడించింది. సమావేశం అనంతరం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా (Rajendra Shukla) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని సర్వీసుల్లో మహిళల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గతంలో 40 ఏళ్లుగా ఉన్న వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచడం సహా కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలవుతోంది.