Rahul Gandhi: నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలు తొలగిచాలని కోరా- రాహుల్ గాంధీ

తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని స్పీకర్ ని కోరినట్లు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు.

Update: 2024-12-11 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని స్పీకర్ ని కోరినట్లు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను(Lok Sabha Speaker Om Birla) కోరినట్లు వెల్లడించారు. "నేను స్పీకర్‌తో సమావేశం నిర్వహించాను. నాపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తొలగించాలని అడిగా. దానిని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు. సభ తప్పనిసరిగా నడపాలి. చర్చ జరగాలన్నదే మా లక్ష్యమన్నారు. వారు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనివ్వండి. కానీ, డిసెంబర్ 13న రాజ్యాంగబద్ధంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ, వారు అదానీ అంశంపై చర్చ జరపాలనుకోవట్లేదు. మేం, ఆ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. వారు మాపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ, సభ మాత్రం తప్పక నడుస్తుంది.' అని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు.

జార్జ్ సోరోస్ వివాదం

అంతకుముందు, బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్ర కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ కు హంగేరియన్ మరియు సంబిత్ పాత్ర రాహుల్ గాంధీ మరియు హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోజ్ మధ్య సంబంధాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపైన అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇకపోతే, పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament session)ప్రారంభమైనప్పట్నుంచి వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. అదానీ వ్యవహారం, సంభాల్ హింసపై చర్చించాలన ప్రతిపక్షాలు రగడతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News