Reliance Jio: దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్ డౌన్.. నెటిజన్ల ఆగ్రహం..!

దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో(Reliance Jio) సేవలకు అంతరాయం(Interruption) ఏర్పడింది.

Update: 2024-12-01 16:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో(Reliance Jio) సేవలకు అంతరాయం(Interruption) ఏర్పడింది. ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం నుంచి చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ డౌన్ అయింది. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు కాల్ డ్రాప్(Call Drop) సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే తమ ఫోన్లలో ఇంటర్నెట్(Internet) స్లోగా వస్తోందని, కొన్ని వెబ్‌సైట్(Websites)లు మొత్తానికే ఓపెన్ కావడం లేదని, సిగ్నల్స్ ఉన్న కాల్ కలవడం లేదని వాపోతున్నారు. ఇక కొందరు తమకు సుమారు నాలుగు గంటలుగా సర్వీస్(Service) సరిగా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. 'మీరు ఇండియాలో రీఛార్జి ప్లాన్‌ల ధరలను పెంచుతూనే ఉంటారు.. కానీ నెట్‌వర్క్, ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం నిరంతరం తగ్గిపోతుంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించండి' అని జియోని ట్యాగ్ 'ఎక్స్(X)'లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యపై జియో ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

Tags:    

Similar News