నిత్యానంద ఆశ్రమంలో ఇద్దరు యువతుల నిర్బంధంపై కీలక తీర్పు
స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు అనుకూలంగా గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. తమ ఇద్దరు కుమార్తెలను నిత్యానంద అక్రమ నిర్బంధంలో ఉంచారని పిటిషన్ వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు అనుకూలంగా గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. తమ ఇద్దరు కుమార్తెలను నిత్యానంద అక్రమ నిర్బంధంలో ఉంచారని పిటిషన్ వేశారు. నిత్యానందకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
జనార్ధన శర్మ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది. జనార్ధన శర్మకు 18, 21 వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు తప్పిపోయినట్లు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జనవరి 10న ఓ వీడియో లింక్ ద్వారా వారు ఎలాంటి అక్రమ నిర్బంధంలో లేరని.. తెలిపింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని.. కోరుకుంటున్నట్లు యువతులు తెలిపారు.
పిటిషనర్ కుమార్తెలు ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసింది కోర్టు. యువతులు ఆధ్యాత్మిక మార్గంలో సంతోషంగా ఉన్నారని పేర్కొంది. యువతులు ఎలాంటి అక్రమ నిర్బంధంలో లేరని సూచించింది. పిటిషన్‌ను కొట్టివేయడం సరైనదని కోర్టు భావించింది. యువతులతో వర్చువల్ ఇంటరాక్షన్ రికార్డు చేశారు. ఈ కేసు రికార్డులో భాగంగా రికార్డింగ్ లను భద్రపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు.