‘రియర్‌వ్యూ మిర్రర్’ వ్యాఖ్యలు.. రాహుల్‌పై ఉపరాష్ట్రపతి ఫైర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ఘాటుగా స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ఘాటుగా స్పందించారు. తప్పుడు మార్గదర్శకంలో నడుస్తున్న వారు మన దేశం ప్రస్తుతం సాధిస్తున్న విజయాలను, మన సత్తాను తెలుసుకోలేక అయోమయంలో పడుతున్నారని చురకలు అంటించారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారులతో న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. దేశంలోని వ్యవస్థలపై బురదజల్లే వారిని దూరం పెట్టాలంటే రియర్ వ్యూ మిర్రర్‌లో చూడాలని అన్నారు.
యాక్సిడెండ్ చేయాలని నిర్ణయించుకున్నవారి నుంచి తప్పించుకోవడం కోసం రియర్ వ్యూ మిర్రర్ ఉపయోగించాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఇటీవల భారతీయ మూలాలు కలిగిన వారితో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్‌పై విరుచుకు పడ్డారు. భవిష్యత్తును చూసే శక్తి వారికి లేదన్నారు. ఇండియా అనే కారును రియర్‌వ్యూ మిర్రర్‌లో చూసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ డ్రైవింగ్ చేస్తున్నాడని దీని వల్ల ఒకదాని తర్వాత మరో యాక్సిడెంట్ అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సైతం అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.