రైసీ, అబ్దుల్లాహియాన్‌లు భారత స్నేహితులుగా గుర్తుండిపోతారు: విదేశాంగ మంత్రి జైశంకర్

ద్వైపాక్షిక సంబంధాలకు విశేష కృషి చేసిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ మంత్రి అమీర్-అబ్దుల్లాహియాన్‌లు భారత స్నేహితులుగా మిగిలిపోతారని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

Update: 2024-05-21 14:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ద్వైపాక్షిక సంబంధాలకు విశేష కృషి చేసిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ మంత్రి అమీర్-అబ్దుల్లాహియాన్‌లు భారత స్నేహితులుగా మిగిలిపోతారని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. సంతాప పుస్తకంపై సంతకం చేసి ఇద్దరు నేతలకు నివాళులర్పించారు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు భారత ప్రభుత్వం సంఘీభావం తెలుపుతుందని చెప్పారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు శక్తివంతమైన నేతలు భారత్‌కు ఎంతో సహకారం అందించారని కొనియాడారు. కాగా, రైసీ, అబ్దుల్లాహియాన్‌లకు గౌరవ సూచకంగా మంగళవారం భారత్ సంతాప దినాన్ని ప్రకటించింది. అంతకుముందు జైశంకర్ మాట్లాడుతూ..చాబహార్ నౌకాశ్రయంలో భారతదేశ కార్యకలాపాలపై భారత్, ఇరాన్‌ల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఖరారు చేయడంలో రైసీ, అమీర్-అబ్దోల్లాహియాన్‌ల సహకారాన్ని జైశంకర్ ప్రశంసించారు. ఇరు దేశాలు మే 13న ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Tags:    

Similar News