రైల్వే న్యూ టైం టేబుల్ రిలీజ్..
భారతీయ రైల్వే మంగళవారం అక్టోబర్ 1 నుంచి ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో కొత్త టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : భారతీయ రైల్వే మంగళవారం అక్టోబర్ 1 నుంచి ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో కొత్త టైమ్ టేబుల్‌ని విడుదల చేసింది. ఇందులో భాగంగా.. 64 వందే భారత్ రైళ్లతో పాటు 70 ఇతర రైల్వే సర్వీసులను కూడా యాడ్ చేశారు. వివిధ నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు గాను కొత్త టైమ్ టేబుల్ రూపొందించబడింది. అదేవిధంగా 90 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను పొడిగించగా.. 22 రైళ్లను సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి మర్చారు. ప్రయాణీకులు కొత్త టైమ్ టేబుల్ ప్రకారం బయలుదేరే ముందు ప్రయాణికులు టైమ్ టేబుల్ సమయాలను తనిఖీ చేయాలని సూచించారు.