రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ స్పందన ఇదే
2019 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: 2019 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "నా మతం సత్యం మరియు అహింస పై ఆధారపడి ఉంది. సత్యమే నా దేవుడు, అహింస (అది) దానిని పొందే సాధనం - మహాత్మా గాంధీ" అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా రాహుల్ ను దోషిగా తేల్చిన కొద్ది గంటల్లోనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేయబడింది.