యూపీ నుంచి రాహుల్ లేదా ప్రియాంక పోటీ: కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Update: 2024-04-11 04:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ నేత ఉత్తరప్రదేశ్ స్థానం నుంచి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారని చెప్పారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడారు. రాయ్‌బరేలీ, అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పార్టీ బరిలోకి దింపుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఊహాగానాలు అవసరం లేదని త్వరలోనే ప్రకటన వెలువడుతుందని తేల్చి చెప్పారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై స్పందిస్తూ..రాబర్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోరని అది జరగని పని అని వ్యాఖ్యానించారు. దేశంలోని సెక్యూలర్ పార్టీలకు గాంధీ కుటుంబంపై పూర్తి విశ్వాసం ఉందని నొక్కి చెప్పారు. కాగా, యూపీలోని రెండు సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొన్ని వేళ ఆంటోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Tags:    

Similar News