ఈడీ కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) డెరెక్టర్ గా రాహుల్ నవీన్ నియమితం అయ్యారు. ఆయన1993-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి.
దిశ, వెబ్ డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) డెరెక్టర్ గా రాహుల్ నవీన్ నియమితం అయ్యారు. ఆయన1993-బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో కొత్త డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా రాహుల్ నవిన్ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధృవీకరించింది. అతను ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈడీ డైరెక్టర్ గా కొనసాగుతారు. 57 ఏళ్ల రాహుల్ నవీన్ 2019 నవంబర్‌లో ఈడీలో స్పెషల్ డైరెక్టర్‌గా చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ యాక్టింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. మధ్యంతర ED హెడ్‌గా నవీన్ పదవీకాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లు వేర్వేరు మనీలాండరింగ్ కేసులలో అరెస్టయ్యారు.