ఏనాడూ మోడీని శత్రువుగా చూడలేదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మంగళవారం వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2024-09-10 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మంగళవారం వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ అంటే తనకు ద్వేషం లేదని అన్నారు. ఆయన్ను ఏనాడూ శత్రువుగా చూడలేదని తెలిపారు. మా ఇద్దరివి వేర్వేరు అభిప్రాయాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కేవలం ఆయన అభిప్రాయాలను, నిర్ణయాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియపైనా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎంతమాత్రం పారదర్శకంగా జరుగలేదని అన్నారు. బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కాదని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అండగా నిలిచిందని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి దేశ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News