Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లకు లేఖ రాసిన రాహుల్ గాంధీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో (US Election Results) రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఘన విజయం సాధించారు. క

Update: 2024-11-08 07:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో (US Election Results) రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఘన విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ట్రంప్‌నకు లేఖ రాశారు. ట్రంప్‌ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌నకు అభినందనలు. అమెరికా, ప్రపంచ దేశాల భవిష్యత్ కోసం ప్రజలు మీ విజన్‌పై విశ్వాసం ఉంచారు. ప్రజాస్వామ్య విలువలపై మన దేశాలు చూపుతున్న నిబద్ధత ఇరుదేశాల మధ్య చరిత్రాత్మకమైన స్నేహాన్ని పంచుకుంటున్నాయి. మీ నాయకత్వంలో పరస్పర ప్రయోజనాల కోసం ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడతాయని విశ్వసిస్తున్నాం’ అని రాహుల్‌ రాసుకొచ్చారు.

కమలా హ్యారిస్ కు లేఖ

అలానే ట్రంప్ నకు గట్టి పోటీ ఇచ్చిన కమలా హ్యారిస్‌ (Kamala Harris) కృషిని అభినందిస్తూ రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో మీ ప్రచారానికి నా అభినందనలు. అందర్నీ ఏకం చేయాలనే మీ సందేశం అందరికీ స్ఫూర్తినిస్తుంది. బైడెన్ (Joe Biden) పరిపాలనలో భారత్‌- అమెరికా సంబంధాలు మరింత పెరిగాయి. ప్రజాస్వామ్య విలువలపై మన భాగస్వామ్య నిబద్ధత ఇరుదేశాలకు మార్గదర్శకంగా కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.


Similar News