Ajit Pawar: మోడీ ఎన్నికల ప్రచారంపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. బారామతి నియోజకవర్గంలో ప్రధాని మోడీని(PM Modi) ఎందుకు ర్యాలీ నిర్వహించడం లేదని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆ నియోజకవర్గంలో కుటుంబంతో పోరు ఉందని, అందుకే అక్కడ ర్యాలీ నిర్వహించాలని మోడీని కోరలేదని పేర్కొన్నారు. ఇకపోతే, బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తుండగా.. అదే ప్రాంతం నుంచి శరద్‌పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అజిత్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం, ఎన్నికల ఖర్చుపై పరిమిత ఆంక్షల కారణంగా అమిత్‌షా వంటి బీజేపీ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని ఎన్సీపీ నేతలు కోరుకోవట్లేదని వెల్లడించారు.
మోడీ ప్రచారం
కాగా.. శుక్రవారం నుంచి ప్రధాని మోడీ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే ప్రచార ర్యాలీలో పాల్గొననున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.