India-Russia: భారత్ ని కొనియాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌ ని కొనియాడారు. తమ దేశానికి భారత్‌ గొప్ప వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు.

Update: 2024-11-08 09:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌ ని కొనియాడారు. తమ దేశానికి భారత్‌ గొప్ప వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌- రష్యా (Russia- India)ల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సోచిలోని వాల్డాయ్‌లో జరిగిన మీటింగ్ లో ఆయన భారత్ గురించి వ్యాఖ్యలు చేసినట్లు మాస్కో మీడియా సంస్థలు తెలిపాయి. ‘భారత్‌ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి భారత్ నిలయం. అలాంటి దేశం ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చేడానికి అర్హత ఉంది. భద్రత, రక్షణరంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం ఏటా 60 బిలియన్‌ డాలర్లుగా ఉంది’ అని పుతిన్‌ పేర్కొన్నారు. అలానే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కొనియాడారు.

ఉమ్మడి కరెన్సీపై..

ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారానికి ఉదాహరణే బ్రహ్మోస్‌ అని పుతిన్ పేర్కొన్నారు. ఇది భారత్‌- రష్యాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్ లో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవని వెల్లడించారు. అంతేకాకుండా, భారతదేశానికి స్వాతంత్ర్యం ఆవిర్భవించడంలో సోవియెట్‌ యూనియన్‌ పాత్రను పుతిన్‌ గుర్తుచేసుకున్నారు. ఇటీవల రష్యాలోని కజన్ వేదికగా జరిగిన 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పాల్గొన్నారు. ఆ సమయంలోనూ భారత్ ని పుతిన్ ప్రశంసించారు. భారత్ ఆర్థికవృద్ధి విజయవంతంగా ముందుకెళ్తుందంటూ ప్రశంసించారు.

Tags:    

Similar News