మళ్లీ ప్రభుత్వ బంగ్లాలోకి రాహుల్ గాంధీ.. మళ్లీ అదే ఫ్లాట్..?

లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్ గాంధీ తిరిగి ప్రభుత్వ బంగ్లాలోకి మారబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2023-08-07 14:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్ గాంధీ తిరిగి ప్రభుత్వ బంగ్లాలోకి మారబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తుగ్లక్ లేన్‌లో గతంలో నివాసం ఉన్న ప్రభుత్వ బంగ్లాను తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనర్హత వేటు అనంతరం ప్రభుత్వ బంగ్లాను రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. అప్పటి నుండి దానిని అధికారులు ఎవరికి కేటాయించలేదు. అయితే రాహుల్ గాంధీ లోక్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ బంగ్లాకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్ సభ హౌసింగ్ కమిటీ ముందు గాంధీ ఇంటి అంశాన్ని లేవనెత్తారు.

అయితే నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఒక వేళ రాహుల్ గాంధీ అప్లై చేసుకుంటే తిరిగి ఆ బంగ్లాను ఆయనకే అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 24న లోక్‌సభ సభ్యత్వం తొలగించిన కొద్ది రోజులకే గాంధీ ఇంటిని ఖాళీ తన తల్లి సోనియాగాంధీతో కలిసి ఉంటున్నారు.

Tags:    

Similar News