రాహుల్ గాంధీపై సీపీఐ అభ్యర్థి పోటీయా..ఎందుకు ? : బీజేపీ

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్‌లోనూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అమేథీ తరహా రిజల్టే రిపీట్ అవుతుందని ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ వ్యాఖ్యానించారు.

Update: 2024-03-25 14:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్‌లోనూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అమేథీ తరహా రిజల్టే రిపీట్ అవుతుందని ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఎదురైన ఓటమిని గుర్తుకు తెచ్చుకోవాలని రాహుల్‌కు ఆయన సూచించారు. వయనాడ్‌కు గత ఐదేళ్లలో రాహుల్ గాంధీ చేసిందేమీ లేదన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఇంకా వెనుకబడే ఉందని సురేంద్రన్ పేర్కొన్నారు. ‘‘బీజేపీ కేంద్ర నాయకత్వం నాకు ఒక కీలక బాధ్యతను అప్పగించింది. వయనాడ్ నియోజకవర్గంలో ప్రజల తరఫున పోరాటం చేపట్టాలని సూచించింది’’ అని ఆయన వెల్లడించారు. ‘‘సీపీఐ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉంది. అలాంటప్పుడు వయనాడ్‌లో రాహుల్ గాంధీపై సీపీఐ నాయకురాలు యానీ రాజా ఎందుకు పోటీ చేస్తున్నారు ? దీనిపై వయనాడ్ ప్రజలు కచ్చితంగా వాళ్లను నిలదీస్తారు’’ అని సురేంద్రన్ కామెంట్ చేశారు. కాగా, ప్రస్తుతం కేరళ బీజేపీ చీఫ్ పదవిలోనూ కె సురేంద్రన్ ఉన్నారు.

Tags:    

Similar News