Ludo King: చిన్నారితో ‘లూడో’ ఆడిన రాహుల్‌ గాంధీ.. తనకు ఆ గేమ్ ఇష్టమేనట!

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, లోక్‌సభ ప్రతపక్షనేత రాహుల్‌గాంధీ మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు.

Update: 2024-07-09 12:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, లోక్‌సభ ప్రతపక్షనేత రాహుల్‌గాంధీ మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు. లక్నో విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఆయన రాయ్‌బరేలీకి వెళ్లారు. అనంతరం బచ్రావాన్‌లోని చురువా హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అమరవీరుడు కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి దండ్రులను కలిశారు. అక్కడి నుంచి రాయ్‌బరేలీ ఎయిమ్స్‌ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌)ను సందర్శించారు. అక్కడ చేరిన రోగులు, వారి కుటుంబాల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కడే ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఓ చిన్నారితో కలిసి రాహుల్ గాంధీ ‘లూడో గేమ్’ ఆడి.. చిన్నారిని ఉత్సాహపరిచారు. తనకు కాసేపు కబుర్లు చెప్పారు. అంతకు ముందు రాహుల్ గాంధీ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి అక్కడే ఒక మొక్కను నాటి నివాళులు అర్పించారు. అయితే, చిన్నారితో కలిసి లూడో గేమ్ ఆడిన రాహుల్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లూడో గేమ్ అంటే రాహుల్ గాంధీకి కూడా ఇష్టమేనని, ఈ రోజు ఇంటర్నెట్‌లో ఇదే క్యూట్ ఫోటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News