జమ్ముకశ్మీర్ ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించిన కాంగ్రెస్
జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేజీ వేణుగోపాల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించారు.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, భరత్ సింగ్ సోలంకి, వికార్ రసూల్ వానీ, జీఎ మీర్, తారిక్ హమీద్ కర్రా, సుఖ్వీందర్ సింగ్ సుఖు, రేవంత్ రెడ్డి, హరీష్ ఉన్నారు. ఈ జాబితాలోనే ప్రమోద్ తివారీ, పవన్ ఖేరా, రంజీత్ రంజన్, టీఎస్ సింగ్ డియో, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, రాజ్ బబ్బర్, పిర్జాదా మొహమ్మద్ సయీద్, మనోజ్ యాదవ్, తారా చంద్, రామన్ భల్లా, చౌదరి లాల్ సింగ్, జిఎన్ మోంగా, షమీమా రైనాతో పాటు ఆకాష్, భరత్ ఉన్నారు.
జమ్మూ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు, 26 అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.