ఏ త్యాగానికైనా సిద్ధం.. అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ

లోక్‌సభలో తనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

Update: 2023-03-24 12:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనను ఎంపీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన రాహుల్.. 'నేను భారత దేశ స్వరం కోసం పోరాడుతున్నాను. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను' అంటూ ట్వీట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీ ఇప్పుడు తన ఎంపీ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో లోక్ సభ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందించారు. ఈ కేసులో సూరత్ కోర్డు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై కూడా నిన్న రాహుల్ ట్విట్టర్ వేదికగానే రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాందీ కొటేషన్ కోడ్ చేశారు. 'నిజం, అహింస, ఇవే నా మతం. సత్యమే నా దైవం' అన్నారు. మరో వైపు రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ముఖ్యమంత్రులు రియాక్ట్ అవుతున్నారు. 

Tags:    

Similar News