Rahul gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. మూడు రోజుల పాటు పర్యటన !

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.

Update: 2024-08-31 15:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్, డల్లాస్ నగరాల్లో టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. ఈ వివరాలను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా వెల్లడించారు. ‘రాహుల్ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత భారతీయ ప్రవాసులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలే పలుసార్లు నాకు విజ్ఞప్తి చేశారు’ అని తెలిపారు. ‘రాహుల్ సెప్టెంబర్ 8వ తేదీన డల్లాస్‌లో, 9,10వ తేదీల్లో వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. డల్లాస్‌లో టెక్సాస్ విశ్వవిద్యాలయంతో పరస్పర చర్చలు జరుపుతారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాల ప్రజలు కూడా రాహుల్ రాకపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారని, ఈ నేపథ్యంలోనే అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశామని తెలిపారు. ఈ సందర్శన కోసం తాము ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 


Similar News