కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ(SM Krishna) (92) ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు.

Update: 2024-12-10 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ(SM Krishna) (92) ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి.. 1999-2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రమంత్రిగా భాద్యతలు నిర్వహించారు. కాగా ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. SM కృష్ణ మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన తన ట్వీట్ లో " S.M కృష్ణ గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. అతని దశాబ్దాల కృషి కర్ణాటక అభివృద్ధికి, బెంగళూరు సాంకేతిక కేంద్రం గా మారడానికి గణనీయంగా దోహదపడింది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, ప్రియమైన వారితో ఉన్నాయి." అని రాసుకొచ్చారు.

 


Similar News