ఆ విషయంపై మోడీ ఇంకెంత కాలం సైలెంట్‌గా ఉంటారు: Rahul Gandhi ఫైర్
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో గుజరాత్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోందని.. ఇంక ఎంతకాలం దీనిపై మోడీ సైలెంట్‌గా ఉంటారని నిలదీశారు. గుజరాత్‌కు వేల కోట్ల డ్రగ్స్ చేరుతున్నాయి.. గాంధీ, పటేల్‌ల పుణ్యభూమిపై ఈ విషాన్ని వ్యాప్తి చేస్తుంది ఎవరు..? ఒకే పోర్ట్‌లో పదే పదే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు పోర్టు యజమానిని ఎందుకు ప్రశ్నించలేదు..? గుజరాత్‌లో డ్రగ్ మాఫియాను నడుపుతున్న వారిని ఎన్‌సీబీ, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎందుకు పట్టుకోలేకపోయాయి..? గుజరాత్ డ్రగ్ మాఫియాకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని.. ఈ వ్యవహారంపై ప్రధాని ఇంకెంత కాలం మౌనంగా ఉంటారన్నారు.