జైపూర్‌లో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ (వీడియో)

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మహారాణి కళాశాలలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ద్విచక్ర వాహనాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంపిణీ చేశారు. అనంతరం స్టూడెంట్స్ నడుపుతున్న బైక్ వెనుకాల కూర్చొని కాంగ్రెస్ సభకు చేరుకున్నారు.

Update: 2023-09-23 11:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని జైపూర్‌లో మహారాణి కళాశాలలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ద్విచక్ర వాహనాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంపిణీ చేశారు. అనంతరం స్టూడెంట్స్ నడుపుతున్న బైక్ వెనుకాల కూర్చొని కాంగ్రెస్ సభకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహిళలకు సాధికారత కల్పించాలని, అప్పుడు దేశాన్ని ఉజ్వల భవిష్యత్తుకు నడిపిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సభలో రాహుల్ ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్ అమలుకు కొత్త జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అవసరమని బీజేపీ చెబుతోంది కానీ వాస్తవానికి 33% రిజర్వేషన్లు నేటి నుంచే అమలు చేయవచ్చని రాహుల్‌గాంధీ అన్నారు. కానీ బీజేపీ మహిళా రిజర్వేషన్లను పదేళ్లు ఆలస్యం చేయాలని చూస్తోందని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News