భారతీయులను అవమానించేలా కార్టూన్.. నెటిజన్ల ఆగ్రహం
దిశ, నేషనల్ బ్యూరో : డాలీ అనే కార్గో నౌక ఢీకొనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెన ఇటీవల కుప్పకూలింది.
దిశ, నేషనల్ బ్యూరో : డాలీ అనే కార్గో నౌక ఢీకొనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెన ఇటీవల కుప్పకూలింది. అయినప్పటికీ నౌకలోని ప్రయాణికులంతా సేఫ్‌గా బయటపడ్డారు. భారతీయ సిబ్బంది చొరవ వల్లే ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నౌకలోని భారతీయ సిబ్బందిని హీరోలుగా అభివర్ణించారు. వారు సకాలంలో నగర అధికారులకు ‘మేడే’ కాల్ చేసినందు వల్లే బ్రిడ్జ్‌పైకి వెళ్లే వాహనాలను వెంటనే ఆపగలిగారని వెల్లడించారు. అయితే ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనను ఉద్దేశిస్తూ అమెరికాకు చెందిన ఓ వెబ్ కామిక్ జాత్యాంహంకార కార్టూన్‌ని ప్రచురించింది. ఈ కార్టూన్ భారతీయులను అవమానించేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత సిబ్బంది పరస్పరం తిట్టుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఆడియోను ఈ కార్టూన్‌కు బ్యాక్ గ్రౌండ్‌లో జోడించి ‘ఎక్స్’ వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా దీనికి 42 లక్షల వ్యూస్, 2వేల కామెంట్స్ వచ్చాయి.