కాంగ్రెస్ కోమాలో ఉంది.. పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఒక్క‌సారే గుజరాత్‌లో పర్యటించి

Update: 2022-12-17 11:36 GMT
కాంగ్రెస్ కోమాలో ఉంది.. పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఒక్క‌సారే గుజరాత్‌లో పర్యటించి గెలవాలని అనుకున్నాడని విమర్శించారు. శనివారం మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలతో కోమాలోకి వెళ్లిందని అన్నారు. సూర్యుడు అస్తమించే రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.

సూర్యుడు ఉదయించే ప్రాంతం(కన్యాకుమారి)లో పాదయాత్ర మొదలైంది. ఈ విషయంలో ఆయన సరిచూసూకోవాలి' అని వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్‌కు మార్పుతో సంబంధం లేదని, మార్పిడిలతో కూడుకున్నదని ఫిరాయింపులను ఉద్దేశించి ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్లడంతో కాంగ్రెస్ బలహీనపడిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉందని చెప్పారు. అంతకుముందు రాహుల్ మాట్లాడుతూ.. గుజరాత్ ఆప్ బీజేపీకి ప్రాక్సీలా ఉండకపోతే.. కాంగ్రెస్ విజయం సాధించేదని అన్నారు.


Similar News