లీలావతి ఆసుపత్రిలో చేతబడులు

ఇదే సమయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ కూడా ఫిర్యాదు చేసింది. ఈడీ, బాంద్రా పోలీస్ స్టేషన్‌లలో విడివిడిగా చేసిన ఫిర్యాదుల్లో సంచలన విషయాలు బయటపెట్టింది.

Update: 2025-03-13 14:04 GMT
లీలావతి ఆసుపత్రిలో చేతబడులు
  • whatsapp icon

- రూ.1200 కోట్ల స్కామ్ ఆరోపణలు

- సంచలనంగా మారిన లీలావతి సంఘటన

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో సుప్రసిద్ధ ఆసుపత్రి లీలావతిలో చేతబడులు చేశారన్ని ఆరోపణలు సంచలనంగా మారాయి. లీలావతి హిస్పిటల్‌ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌లో జరిగిన కుంభకోణలాలపై కూడా అనేక ఆరోపణలు వెల్లుతెత్తుతున్నాయి. ఆ ట్రస్టులో పని చేసిన మాజీ ధర్మకర్తలు రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అదే సమయంలో మోసపూరిత ఆర్డర్లు, నిదుల దుర్వినియోగం వంటి అభియోగాలను కూడా మోపారు. ఆసుపత్రిలో సామాగ్రి కొనుగోలుకు సంబంధించి థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీని వల్ల రూ.1200 కోట్లు దుర్వినియోగం అయినట్లు సదరు మాజీ ట్రస్టీలు ఆరోపించారు. లీలావతి ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడైన విజయ్ మెహతా ట్రస్ట్‌లో జరుగుతున్న అనేక అక్రమాలపై విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ మెహతా ఆధ్వర్యంలో చేపట్టిన ఫోరెస్సిక్ ఆడిట్‌లో అనేక ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి.

ఇదే సమయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ కూడా ఫిర్యాదు చేసింది. ఈడీ, బాంద్రా పోలీస్ స్టేషన్‌లలో విడివిడిగా చేసిన ఫిర్యాదుల్లో సంచలన విషయాలు బయటపెట్టింది. లీలావతి ఆసుపత్రి ప్రాంగణంలో గతంలో ట్రస్టీలుగా పని చేసిన వారు చేతబడులు చేశారని ఆరోపించింది. ఆసుపత్రి ప్రాంగణలంలో మనుషుల వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన కలశాలను గుర్తించామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్ మెహతా, అతని తల్లి చారు మెహతా కార్యాలయాల్లో ఈ చేతబడులు జరిగినట్లు వారు చెప్పారు. అయితే ఆరోపణల పూర్తి విచారణ చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పటికే లీలావతి ఆసుపత్రిలో వెంట్రుకలు, ఎముకల ఆనవాళ్ల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు లీలావతి ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురిపై రూ.85 కోట్ల మోసం కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలిసింది.

Tags:    

Similar News