Manipur: మణిపూర్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి

తాజాగా కిడ్నాప్‌కు గురైన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు హత్య చేశారు.

Update: 2024-11-16 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో హత్యకు గురైన మహిళలు, పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మణిపూర్ మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడులు చేశారని పోలీసులు తెలిపారు. గతవారం జిరిబామ్‌లోనే బొకొబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేసి మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి భద్రతా దళాలకు, కుకీలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో 10 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. తాజాగా కిడ్నాప్‌కు గురైన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు హత్య చేశారు. వారి మృతదేహాలు నదిలో కనిపించాయి. ఈ దారుణంపై ఆగ్రహానికి గురైన మెయితీ వర్గ ప్రజలు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. దాడులపై అప్రమత్తమైన అధికారులు ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, థౌబల్, కాక్‌చింగ్, కాంగ్‌పోకపి, చురచంద్‌పూర్‌లలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు. లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఓ గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. 

Tags:    

Similar News