మూడు రాష్ట్రాల్లో NIA సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మూడు రాష్ట్రాల్లోని 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మూడు రాష్ట్రాల్లోని 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని గజ్వా-ఈ-హింద్ కేసులో గురువారం కేంద్ర సంస్థ తనిఖీలు నిర్వహించింది. ఈ సంస్థ యువతను తప్పుదోవ పట్టించి, ఉగ్రవాదం వైపు దృష్టిని మళ్లిస్తుందని ఆరోపణలతో సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దేశ వ్యతిరేక చర్యలు, యువతను సామాజిక మాధ్యమాల ద్వారా విద్రోహ చర్యలకు ప్రేరేపిస్తున్న అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. గజ్వా-ఈ-హింద్ పేరుతో సోషల్ మీడియాలో గ్రూప్ క్రియేట్ చేసి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పలువురిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.