Priyanka: వయనాడ్ బాధితులను బీజేపీ మోసం చేసింది.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి బాధితులుగా మారిన ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

Update: 2024-10-29 15:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్‌(Wayanad)లో కొండ చరియలు విరిగిపడి బాధితులుగా మారిన ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె మలప్పురం(Malappuram), కోజికోడ్(kojikode) జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రచార సభల్లో ప్రియాంక ప్రసంగించారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రధాని మోడీ (Pm modi) వారికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతేగాక ప్రజాస్వామ్యాన్ని (Democracy) ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ద్వేషం, విభజనను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు ఆయనకు చెందిన కొంత మంది మిత్రులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని తెలిపారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడతానని, వయనాడ్ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. అనంతరం మలప్పురంలోని సీతీ హాజీ మెమోరియల్ ఫుట్‌బాల్ స్టేడియం(Foot ball stadium)ను ప్రియాంక సందర్శించారు. అక్కడ ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్లతో కాసేపు మాట్లాడారు.

Tags:    

Similar News