నాసిక్‌లో ‘అటల్ సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని మోడీ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇవాళ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.

Update: 2024-01-12 10:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని మోడీ మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇవాళ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోనే నాసిక్‌లో మెగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదీకి పూజలు చేసి.. చారిత్రక కాలారామ్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేశారు. మరోవైపు ముంబాయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ముంబాయిలోని సేవ్రి నుంచి రాయగఢ్ జిల్లాలోని సహవా శేవాను కలుపుతూ.. రూ.17,840 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. కాగా, ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం బ్రిడ్జ్‌కు అటల్ సేతు అని నామకరణం చేశారు. 

Tags:    

Similar News