మొదలైన ఫోర్త్ ఫేజ్ లోక్ సభ ఎలక్షన్స్.. ఓటర్లకు ప్రధాని మోడీ సంచలన పిలుపు
దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫోర్త్ ఫేజ్‌లో దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫోర్త్ ఫేజ్‌లో దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ సీట్లలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మొదలైన పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడతలో ఓటర్లందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. నాలుగో దశలో ఎన్నికలు జరుగుతోన్న 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఓటర్లు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తు్న్నానని అన్నారు.
యువత, మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా ఓటర్లకు మోడీ పిలుపునిచ్చారు. ఇక, నాలుగో దశలో భాగంగా తెలంగాణలో 17, ఏపీలో 25, యూపీలో 13, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, బెంగాల్‌లో 8, జమ్ము కశ్మీర్‌లోని (శ్రీనగర్) 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. ఫోర్త్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతోన్న 96 స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నాలుగో దశలో పలువురు రాజకీయ ప్రముఖులు బరిలోకి దిగారు.