ఆ 10 ఏళ్లు భారత్‌లో రక్తం ఏరులై పారింది: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్

రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో బుధవారం ప్రధాని మోడీ మాట్లాడారు.

Update: 2023-02-08 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో బుధవారం ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించారు. యూపీఏ హాయంలో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయని.. దేశంపై అనేక దాడులు జరిగాయన్నారు. 2008లో ముంబైలో జరిగిన దాడులను ఎవరు మర్చిపోలేరని అన్నారు. యూపీఏ హయంలోని 10 ఏళ్లు దేశంలో రక్తం ఏరులై పారిందన్నారు. డిఫెన్స్ కుంభకోణాలు, హెలికాఫ్టర్ కుంభకోణాలు ఇలా ప్రతి దాంట్లో స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. 2014కు ముందు దశాబ్దం లాస్ట్ డికేడ్‌గా నిలిచిపోతుందని.. ఈ దశాబ్దం ప్రపంచానికి ఇండియా డికేడ్‌గా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తారు.. కేసుల్లో ఓడిపోతే కోర్టులపై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. చివరికి దేశం కోసం సేవ చేస్తోన్న సైనికులపై కూడా ఆరోపణలు చేస్తున్నారన్నారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయన్నారు. యూపీఏ హయంలో భారత్‌కు ప్రపంచంలో ఏ విలువ లేకుండా పోయిందన్నారు. నిన్న సభలో ఓ నాయకుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని.. కానీ ఆయన ఇవాళ సభకు కూడా రాలేదని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News