PM Modi : శ్రీలంకకు లిక్విడ్ నేచురల్ గ్యాస్ సరఫరాకు ప్రధాని ఆమోదం
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే(Srilanka President Anura Kumara Dissanayake) ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో భేటీ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే(Srilanka President Anura Kumara Dissanayake) ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శ్రీలంకకు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(Liquid Natural Gas) సరఫరా చేస్తామని చెప్పారు. భారత్-శ్రీలంక దేశాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం-తలైమానార్(Rameshwaram- Talaimanar) మధ్య ఫెర్రీ సర్వీస్‌లను త్వరలోనే ప్రారంభించన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే హైడ్రోగ్రఫీ సహకారం కోసం ఒప్పందం కుదిరిందని, రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా త్వరలో ఖరారు చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అలాగే మత్స్యకారుల సమస్యలు కూడా ఇరు దేశాధినేతలు చర్చించారు. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని, శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని భారత్ ఆశిస్తోందని మోడీ తెలియజేశారు. శ్రీలంకకు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మోడీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.