అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము

అయోధ్య రామయ దర్శనం సందర్భంగా హారతి కార్యక్రమంలో పూజ, హారతి కార్యక్రమం నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది.

Update: 2024-04-30 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అయోధ్యను సందర్శించి రామమందిరంలో ప్రార్థనలు నిర్వహించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయోధ్య రామయ దర్శనంతో పాటు హనుమాన్ గర్హి ఆలయంలో హనుమతుడిని దర్శించుకుని, ప్రభు శ్రీరామ దేవాలయం, కుబేర్ టీలాలో హారతి కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రాష్ట్రపతి అయోధ్యలో పూజ కార్యక్రమం నిర్వహించేటప్పుడు మినహా మిగిలిన సమయంలో సాధారణ భక్తులకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దర్శనానికి టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు సైతం తమకు కేటాయించిన సమయంలో దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం 4 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. ఈ సందర్భంలో యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రపతికి ఆహ్వానం పలకనున్నారు. మూడు గంటల పాటు రాష్ట్రపతి అయోధ్యలో ఉండనున్నారు. 

Tags:    

Similar News