రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 64వ వర్థంతిని దేశవ్యాప్తంగా 'మహా పరినిర్వాన్‌ దివస్‌'గా నిర్వహిస్తున్నారు.

Update: 2022-12-06 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 64వ వర్థంతిని దేశవ్యాప్తంగా 'మహా పరినిర్వాన్‌ దివస్‌'గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.'మహా పరినిర్వాన్‌ దివస్ సందర్భంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించాను. ఆయన లక్షల మందిలో ఆశలు చిగురించేందుకు శ్రమించారు. భారత్‌ ఎన్నటికీ మర్చిపోలేని ఆదర్శప్రాయమైన రాజ్యాంగాన్ని అందించేందుకు కృషి చేశారు'అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

స్పీకర్‌ ఓం బిర్లా కూడా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు.'సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ ఉండేలా ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్య రాజ్యాంగాన్ని అందించారు'అని పేర్కొన్నారు. మరోవైపు, ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, అధిర్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎడవల్లి

Tags:    

Similar News