తమిళనాడు పాలిటిక్స్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?
సుస్థిర పాలనతో దేశంలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: సుస్థిర పాలనతో దేశంలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది. రోజురోజు తన ఉనికి పెంచుకుంటూ దేశంమంతటా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు ఏవైనా, రాష్ట్రం ఏదైనా సరే తమకు ఓటు బ్యాంకు లేనిచోటు కూడా బీజేపీ ప్రజల్లోకి అద్భుతాలు చేస్తోంది.
అయితే, దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమిళనాడు రాజకీయలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్నామలై నేతృత్వంలోని బీజేపీ ప్రాంతీయ పార్టీలకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వబోతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరూ ఊహించని విధంగా 14 శాతం ఓటు షేర్ వచ్చిందని గుర్తు చేశారు. అధికార పక్షం తప్పలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఈ సారి తమిళనాడులో బీజేపీ రెండకెల ఓటు షేర్ సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటికే బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఇప్పటికే దేశంలో జమ్మూకాశ్మీర్ (పీడీపీ - బీజేపీ కూటమి ప్రభుత్వం), హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి అధికారంలో ఉన్నాయి. ఇక కేరళలో కేరళలో లెఫ్ట్ పార్టీలు, తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, త్రిపురలో లెఫ్ట్, ఒడిషాలో బీజేడీలు అధికారంలో కొనసాగుతున్నాయి.
BIG NEWS ⚡⚡ Prashant Kishore said "Make no mistake, BJP will be getting double digit vote share this time in Tamilnadu."
— Times Algebra (@TimesAlgebraIND) January 31, 2024
He said In Telangana, BJP got 14% votes which is a very good launching pad for a party like BJP.
Only 3 months back he had said, "BJP will be a political… pic.twitter.com/Fb650DtFzr