సీరం అధినేత పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు.. ఏడుగురు అరెస్ట్

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పూనవాలా పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.. Latest Telugu News

Update: 2022-11-26 10:24 GMT

ముంబై: సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అధర్ పూనవాలా పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.01 కోట్ల ఘరానా మోసానికి పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పూణే పోలీసులు శనివారం వెల్లడించారు. సీరం అధినేత అధర్ పూనవాలా పేరుతో కొందరు డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు సీరం సంస్థ డైరక్టర్ సతీష్ దేశ్ పాండే ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ లో పునవాలే పేరుతో ఏడు వేర్వేరు అకౌంట్లలోకి డబ్బులు పంపాలని కోరినట్లు వాట్సాప్ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. నిజమేనని నమ్మిన దేశ్ పాండే రూ.1.01 కోట్ల ఆయా ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అది మోసమని గుర్తించిన ఆయన పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నారని తెలిపారు. సంబంధిత అకౌంట్లను సీజ్ చేశామని పేర్కొన్నారు. సీజ్ చేసిన అకౌంట్లలో రూ.13 లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. 

Tags:    

Similar News