బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో పోలీసు అధికారికి జీవిత ఖైదు
త్రిపురలోని ఒక బ్యాంకు మేనేజర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి జూన్ 3న కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన వారిలో ఓ పోలీసు అధికారి, సంపన్న వ్యాపారి కుమారుడు కూడా ఉన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : త్రిపురలోని ఒక బ్యాంకు మేనేజర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి జూన్ 3న కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన వారిలో ఓ పోలీసు అధికారి, సంపన్న వ్యాపారి కుమారుడు కూడా ఉన్నారు. 2019 ఆగస్టులో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బోధిసత్త దాస్‌ను హత్య చేసిన కేసులో నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు. ఉజ్జయంత ప్యాలెస్ సమీపంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన బోధిసత్త దాస్ కొన్ని రోజుల చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ, సంబంధిత కేసులో విచారణ వేగవంతం చేయాలని ప్రజలు రొడ్డెక్కారు. కేసులో ప్రధాన నిందితులు చెప్పబడుతున్న సుకాంత్ బిస్వాస్, సుమిత్ చౌదరి, సుమిత్ వానిక్, అమర్ సరీఫ్ లలో సుకాంత్ బిస్వాస్ పోలీసు శాఖలో విధుతు నిర్వర్తిస్తున్నాడు. కేసు పూర్వాపరాలు పరశీలించిన పశ్చిమ త్రిపుర జిల్లా, సెషన్స్ జడ్జి ట్రయల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు, రూ.50 వేల జరిమానా విధించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సామ్రాట్ కర్ భౌమిక్ తెలియజేశారు. విచారణ సమయంలో మొత్తం 56 మంది సాక్షులను విచారించినట్లు ఆయన తెలిపారు.