రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం.. ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన మోడీ

ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీయే పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోడీ భేటీ అయ్యారు.

Update: 2024-07-02 07:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీయే పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోడీ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో మిత్రపక్ష ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో రాహుల్‌ గాంధీ, విపక్షాల మాటల దాడుల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. దేశసేవ ప్రథమ కర్తవ్యమని ఎంపీలందరికీ మోడీ సూచించారు సూచించారు.

కిరణ్ రిజిజు ఏమన్నారంటే?

కాగా.. సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ మీడియాతో మాట్లాడారు."ప్రధాని ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఎంపీలందరూ దేశసేవ చేసేందుకు పార్లమెంటుకు వచ్చారని.. దానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సభలో ఎలా నడుచుకోవాలో మార్గనిర్దేశనం చేశారు" అని కిరణ్ రిజిజు చెప్పారు. నిబంధనలను అనుసరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించాలని ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. ఎంపీలు సక్రమంగా ప్రవర్తించాలని.. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని మోడీ చెప్పినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ స్పీకర్ ని అవమానించేలా మాట్లాడారని.. ఎంపీలు అలా చేయొద్దని మోడీ హితవు పలికారన్నారు. కాగా.. ఎన్డీఏ ఎంపీల సమావేశం.. సోమవారం లోక్ సభలో జరిగిన రచ్చ గురించి కాదని.. ఎంపీల మధ్య సమన్వయం పెంచేందుకు నిర్వహించామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News

టమాటా @ 100