ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో 5 వందే భారత్ రైళ్లను మంగళవారం జాతికి అంకితం ఇవ్వనున్నారు.

Update: 2023-06-26 11:21 GMT

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో 5 వందే భారత్ రైళ్లను మంగళవారం జాతికి అంకితం ఇవ్వనున్నారు. 5 కొత్త రూట్లలో రాకపోకలు సాగించనున్న ఈ రైళ్లను మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో రెండు కొత్త రైళ్లు మధ్యప్రదేశ్‌లో.. కర్ణాటక, బీహార్‌, గోవాలలో చెరొకటి అందుబాటులోకి వస్తాయి. మధ్యప్రదేశ్ లోని రాణి కమలాపతి (భోపాల్)- జబల్‌పూర్.. ఖజరహో-భోపాల్-ఇండోర్ రూట్లలో నూతన వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తాయి. మడ్గావ్ (గోవా)-ముంబయి, ధార్వాడ్-బెంగళూరు, హతియా-పాట్నా రూట్లలో మిగితా మూడు రైళ్లు నడుస్తాయి. దీంతో దేశంలో అందుబాటులోకి వచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సంఖ్య 23కి పెరుగుతుంది.

Tags:    

Similar News