ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే మొదటి ఫేజ్ ను ప్రారంభించిన పీఎం మోడీ

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే మొదటి ఫేజ్ ను పీఎం మోడీ ప్రారంభించారు.

Update: 2023-02-12 11:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంతో ప్రతిష్టాత్కకంగా చేపట్టిన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే మొదటి ఫేజ్ (246 కిలోమీటర్లు) ను ఆదివారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీ-దౌసా-లాల్సాట్ సెక్షన్ కు సంబంధించిన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే మొదటి ఫేజ్ ను పీఎం మోడీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. అనంతరం రూ.18,100 కోట్ల విలువైన రోడ్డు పనులకు పీఎం శంకుస్థానపన చేశారు. ఈ సందర్భంగా పీఎం మోడీ మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే తో ప్రయాణికులకు వ్యయ ప్రయాసాలు తగ్గతాయని చెప్పారు.


భారత ఆర్థిక ప్రగతికి ఈ ఎక్స్ప్రెస్ వే బాటలు వేస్తుందని పీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టు నిర్మాణాల వల్ల దేశ ప్రగతి పరుగులు పెడుతుందని చెప్పారు. దేశంలో మౌళిక సదుపాయాల కల్పనకు తొమ్మిదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో సమర్థ భారత నిర్మాణానికి పాటు పడుతున్నామని పేర్కొన్నారు. కాగా.. రూ.12,150 కోట్లతో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని చేపట్టారు.

Tags:    

Similar News