Independence Day: అసోంలో 19 చోట్ల బాంబులు పెట్టిన తిరుగుబాటుదారులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం- ఇండిపెండెంట్ (ULFA-I) పేర్కొంది.

Update: 2024-08-15 10:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం- ఇండిపెండెంట్ (ULFA-I) పేర్కొంది. అసోంవ్యాప్తంగా 19 బాంబులు అమర్చినట్లు వెల్లడించింది. అసోంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి సహా పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు పత్రికా ప్రకటనలో ఈ సంస్థ పేర్కొంది. గురువారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నట్లు ఉగ్రసంస్థ వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్ల ఉల్ఫా ఆపరేషన్‌ను విరమించుకున్నట్లు తెలిపింది. పేలుడు పదార్థాల వల్ల సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని రికవరీ చేయాలని కోరింది. అయితే, శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల నుండి "అనుమానాస్పద వస్తువులను" గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


Similar News