సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగింత: ఇండియన్ నేవీ ప్రకటన

గతవారం సోమాలియా తూర్పు ప్రాంతంలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకున్న సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది.

Update: 2024-04-04 06:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గతవారం సోమాలియా తూర్పు ప్రాంతంలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకున్న సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత నావికాదళానికి చెందిన ఐఎస్ఎస్ త్రిశూల్, ఐఎన్ఎస్ సుమేధలు గత నెల 29న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆల్ కంబార్ అనే నౌకను, అందులో ఉన్న 23 మంది పాకిస్థానీ పౌరులను విజయవతంగా రక్షించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే తొమ్మిది మంది దొంగలను పట్టుకున్నారు. వారందరినీ ఐఎన్ఎస్ త్రిశూల్‌లో బుధవారం ముంబైకి తీసుకొచ్చారు. తదుపరి చర్యల నిమిత్తం పోలీసులకు అప్పగించామని ఇండియన్ నేవీ ప్రతినిధి కమాండ్ వివేక్ మధ్వల్ తెలిపారు. హిందూ మహాసముద్రంలో జాతీయతతో సంబంధం లేకుండా ప్రతీ దేశానికి చెందిన రవాణా నౌకలను రక్షించేందుకు ఇండియన్ నేవీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News