99 మంది కాంగ్రెస్ ఎంపీలపై హైకోర్టులో పిల్

ఉత్తరప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ఓ పిల్ యూపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

Update: 2024-08-10 14:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ఓ పిల్ యూపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 99 మంది ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం ఆ కలకలానికి కారణమైంది. ఇంతకీ ఏంటా పిల్..? లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'ఘర్ ఘర్ గ్యారంటీ స్కీమ్'లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ స్కీంతో అమాయక ప్రజల ఓట్లు పొంది 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. అయితే ఈ ఘర్ ఘర్ గ్యారంటీ స్కీమ్ అనేది ఓటర్లకు డబ్బు ఆశ చూపడం లాంటిదే అని, అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ.. ఈ 99 ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఫతేపూర్ జిల్లాకు చెందిన భారతి దేవి అనే మహిళ అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. అంతేకాదు ప్రజలను, ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని, తిరగి ఎన్నికలు నిర్వహించేలా చూడాలని భారతి ఆ పిల్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్ట్ ఎలా స్పందిస్తోనని యూపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది.


Similar News