POCSO Case : ‘పోక్సో’ కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష.. నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో : లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘పోక్సో’(POCSO Case) చట్టంలోని అభియోగాలతో జీవిత ఖైదు శిక్షపడిన ఓ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

Update: 2024-12-27 15:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘పోక్సో’(POCSO Case) చట్టంలోని అభియోగాలతో జీవిత ఖైదు శిక్షపడిన ఓ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సంచలన తీర్పును వెలువరించే సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం(Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ నమోదైన అభియోగాలకు.. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలానికి పొంతన లేదని బెంచ్ స్పష్టం చేసింది. లైంగికంగా సంభోగించినట్టుగా కానీ, లైంగిక దాడికి పాల్పడినట్టుగా కానీ బాలిక వాంగ్మూలంలో ప్రస్తావనే లేదని తేల్చి చెప్పింది.

‘‘ఈ కేసులో 14 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించాక.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అందులో బాధిత బాలిక.. సదరు వ్యక్తితో తనకు ‘శారీరక సంబంధం’ ఉందని తెలిపింది. ‘శారీరక సంబంధం’ అనే ఒక్క పదం ఆధారంగా దీన్ని పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేం. శారీరక సంబంధం వేరు.. లైంగిక దాడి వేరు..’’ అని ఢిల్లీ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో కలిగే సందేహాల వల్ల కచ్చితంగా నిందితులకే ప్రయోజనం దక్కాలని ధర్మాసనం పేర్కొంది.

Tags:    

Similar News